Friday, November 22, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..

- Advertisement -
- Advertisement -

47092 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో 509 మంది బాధితులు మరణించారు. ఇందులో ఒక్క కేరళలోనే 30,203 కేసులు నమోదవగా, 115మంది బాధితులు మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,39,529మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.గత 24 గంటల్లో కొత్తగా 35,181మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,20,28,825మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3.89లక్షల కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ లో 66.30కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

47092 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News