న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,262 మందికి కరోనా సోకిందని, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదేసమయంలో 23,907 మంది కోలుకోగా, 275 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కి చేరాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,60,441 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అందులో 3,68,457 మందికి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దేశంలో 5,08,41,286 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, భారత్ లో మంగళవారం వరకు మొత్తం 23,64,38,861 కరోనా టెస్టులు చేసినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ప్రకటించింది. నిన్న 10,25,628 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
దేశంలో మరో 47,262 మందికి కరోనా
- Advertisement -
- Advertisement -
- Advertisement -