Wednesday, January 22, 2025

దేశంలో కొత్తగా 4777 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 4777 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,45,68,114కు చేరింది. ఇందులో 4,39,95,610 మంది కోలుకోగా 5,28,510 మంది బాధితులు కన్నుమూశారు. మరో 43,994 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 12 మంది మృతిచెందగా 5196 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.58 శాతంగా ఉన్నదని, మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News