Friday, December 20, 2024

బరిలో 4798 మంది

- Advertisement -
- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల కన్నా రెట్టింపయిన అభ్యర్థుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ల దా ఖలు చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంగా చివరి మూడు రోజులు ముహూర్తంగా బాగుంటుండటం తో ప్రధాన పార్టీల అభ్యర్థులు దేవాలయాల కు వెళ్లి నామినేషన్ల పత్రాలకు పూజ చేయిం చి అట్టహాసంగా ప్రచారం రథాలపై రోడ్లపై ఊరేగింపుగా వెళ్లి సమీప రిట్నరింగ్ కార్యాలయంలో నామినేషన్లు వేశారు.

ఈనెల 3న 96 మంది, 4న 136, ఈనెల 6న 207, 7న 281 మంది, ఈనెల 8న 618 మంది, 9న 1133 మంది, ఈనెల 10న 2327 మంది వేశారు. ఎన్నికల్లో మొత్తం 4798 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 2399 నామినేష న్లు వేయగా అందులో 456 తిరస్కరణకు గురికాగా, 367 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో 1569 మంది అభ్యర్థులు దరావత్తు కోల్పొయారు. చివరిరోజు నామినేషన్లు సి ఎం కెసిఆర్ పోటీచేసే గజ్వేల్‌లో 68, కా మారెడ్డిలో 37మంది దాఖాలు చేసినట్లు, మొత్తంగా చూస్తే ఈరెండు నియోజకవర్గాల్లో రైతులు, యువత, మహిళా సంఘాల నేతల పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News