న్యూఢిల్లీ : మొత్తం 61 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో ఇప్పటివరకు 48 కోట్ల మంది తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్‌పర్సన్ నితిన్ గుప్తా వెల్లడించారు. అదే సమయంలో పాన్‌తో ఇంకా ఆధార్‌ను లింక్ చేయని వారు మొత్తం 13 కోట్ల మంది ఉన్నారు. మార్చి 31 గడువులోగా పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయని అనేక పన్ను, వ్యాపారాలకు సంబంధించిన ప్రయోజనాలను పొందలేరని ఆదివారం సిబిడిటి చైర్‌పర్సన్ నితిన్ తెలిపారు. సిబిడిటి చైర్మన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు దేశంలో దాదాపు 61 కోట్ల మంది పౌరులకు పాన్ కార్డులు జారీ చేయగా, 48 కోట్ల మంది తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఇంకా ఈ పని పూర్తి చేయని వారు 13 కోట్ల మంది ఉన్నారని, వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోవాలని తరచూ ప్రజలకు సలహా ఇస్తున్నామని అన్నారు.
గడువు లోగా పని పూర్తి చేయకపోతే పాన్ సౌకర్యాలను కోల్పోతారని అన్నారు. ఇంతకుముందు కూడా ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ల లింక్ గడువును చాలాసార్లు పొడిగించింది. 2023 మార్చి 31లోగా పాన్, ఆధార్‌లను లింక్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ రెండు లింక్‌లు లేకుంటే, పాన్ కార్డ్ పనిచేయదు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేరు. దీంతో పాటు బ్యాంకు ఖాతా విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి 31 తర్వాత పాన్, ఆధార్‌ను లింక్ చేస్తే, రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.