Sunday, December 22, 2024

చీకట్లు నింపిన వెలుగుల పండుగ

- Advertisement -
- Advertisement -

బాణసంచా పేలుస్తూ ప్రమాదవశాత్తు గాయాల బారిన పడి పలువురు ఆస్పత్రిపాలయ్యారు. దీపావళి పండుగ వేళ అజాగ్రత్తగా టపాసులు కాలుస్తుండగా పేలుడు ధాటికి 48 మంది గాయాలతో నగరంలో సరోజినిదేవి కం టి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ప్రతి ఏ టా పండుగ వేళ టపాసులు కాలుస్తూ ఇలా కంటితో పలుచోట్ల గాయాలతో ఆస్పత్రి కి రావడం పరిపాటి. పలు జి ల్లాల్లో పండుగ రోజూ సరదాగా ఇళ్ల ముందు, మైదానంలో నిర్లక్షంగా లు కాలుస్తుండగా ఇందులో 20మంది పిల్ల లు, మరో 28మంది పెద్దలు కంటి, ఇతర చో ట్ల గాయాలకు గురయ్యారు. ఇందులో 45 కే సులు నగరం నుంచి కాగా.. మరో మూడు ఇ తర జిల్లాలకు చెందిన రోగులున్నారు.

ఇందు లో 40మందికి చిన్న గాయాలతో చికిత్సలు చే సి డిశ్చార్జీ చేశారు. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సరోజిని ఆస్పత్రి సూ పరింటెండెంట్ డాక్టర్ పి. మోదిని వివరించా రు. మిగతా వారిని కూడా మెరుగైన చికిత్సలు అందించి త్వరలో వారి ఇళ్లకు పంపిస్తామన్నా రు. టపాసుల పేలుళ్లకు కంటికి గాయాలైన వారికి తొలుత చికిత్సలు చేసి మందులు ఇచ్చారు. పలువురు పూల్ చడీలు, అధిక శబ్దంతో పేలుళ్ల దగ్గరగా ఉన్న వారికి కంటికి గాయాలు, ఆలానే సుత్లీ బాంబు శబ్దం ధాటికి అందులోంచి రాళ్లు ఎగిరి ఓ బాలుడిపై పడి తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరంతా ఆజాగ్రత్త, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే గాయాలకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా కేసులు తగ్గాయని, దీనికి కారణం ప్రజల్లో అవగాహన పెరగడం వల్లనే అని పలువురు చెబుతున్నారు. టపాసుల పేలుడుకు గాయాలైన వారి సౌకర్యార్ధం ఆస్పత్రిలో అదనంగా వంద బెడ్లను అందుబాటులో ఉంచామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News