Monday, November 25, 2024

క్రూజ్ నౌకలో 48 మందికి కొవిడ్ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

48 test positive for Covid on worlds biggest cruise ship

న్యూఢిల్లీ : ప్రపంచం లోనే అతిపెద్ద క్రూజ్ నౌకగా పేరొందిన ‘ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్’ ఇప్పుడు కరోనా క్లస్టర్‌గా మారింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 48 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 6 వేల మందికి పైగా ప్రయాణికులున్న ఈ నౌకను ప్రస్తుత ఫ్లోరిడా లోని మియామీ పోర్ట్‌లో నిలిపి ఉంచారు. రెండు రోజుల క్రితం నౌకలో ఓ ప్రయాణికురాలికి కొవిడ్ పాజిటివ్ బయటపడడంతో ఆమెకు దగ్గరగా ఉన్న ప్రయాణికులకు కూడా పరీక్షలు చేయగా 48 మందికి పాజిటివ్‌గా తేలినట్టు నౌక యాజమాన్య సంస్థ ది రాయల్ కరేబియన్ ప్రకటించింది. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా ? కాదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం 6 వేల మంది ప్రయాణికుల్లో 98 శాతం మంది రెండు డోసులు తీసుకున్నవారేనని రాయల్ కరేబియన్ వెల్లడించింది. ప్రయాణికులందర్నీ క్వారంటైన్‌లో ఉంచినట్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News