Thursday, January 23, 2025

కాటేదాన్ టు షాద్‌నగర్ గంజాయి చాక్లెట్స్…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఫరూఖ్‌నగర్: కాటేదన్ నుండి గంజాయి చాక్లెట్లను తెచ్చి షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ తదితర చోట్ల అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న కొందరిని షాద్‌నగర్ పట్టనంలోని నాగులపల్లి రోడ్డులో బుధవారం రాత్రి షాద్‌నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. షాద్‌నగర్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగులపల్లి రోడ్డులో గల రెండు కిరాణ దుకాణాలల్లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నారన్న సమాచారంతో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారుల బృదంతో కలిసి బుధవారం రాత్రి పది గంటలకు తనిఖీలు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నిల్వ ఉన్న 480గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని విచారించగా నందిగామ అయ్యప్పటెంపుల్ వద్ద జలేందర్ అనే వ్యక్తి నుండి సరఫరా చేసుకుని షాద్‌నగర్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

సుశీల్, శశికాంత్ ఇచ్చిన ఆధారాలతో జలేందర్‌ను అదుపులోకి తీసుకొని తనీఖీ చేసి 40గంజాయి చాక్లెట్లు లభించాయని, వారికి కాటేదాన్‌కి చెందిన అజయ్‌కుమార్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. సుశీల్, శశికాంత్, జలేందర్, అజయ్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయని, ఇటీవలే ఓ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను ఉపేక్షించేది లేదని, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్కడైన విక్రయాలు జరిపితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎక్సైజ్ శాఖ సిబ్బంధి, రాష్ట్ర టాస్క్‌ఫోర్సు అధికార బృందం పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News