Wednesday, January 22, 2025

4800 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు

- Advertisement -
- Advertisement -

చురుగ్గా సాగుతున్న హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన

మన తెలంగాణ/సిటీబ్యూరో :  వినాయక నిమజ్జనం పూర్తి కావడంతో హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. వ్యర్థాల తొలగింపు ప్రక్రియలో భాగంగా శుక్ర, శనివారం ఈ రెండు రోజులు కలిపి దాదాపు 4800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించా రు. హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో క్రేన్ల సహాయంతో వ్యర్థాలను వెలికి తీస్తుండగా, జిహెచ్‌ఎంసి ఆ వ్యర్థాలను ప్ర త్యేక వాహనాలతో డంపింగ్ యార్డుకు తరలిస్తోంది.

నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో పేరుకు పోయిన ఇనుప చువ్వలతో పాటు చెక్కలు, పూలు ఇతర పూజా సామగ్రి చెత్తాచెదారాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్ తదితర 7 ప్రాంతాలతో పాటు పిపుల్స్ ప్లాజా, ఎన్‌టిఆర్ మార్గ్‌లోని వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆదివారం నుంచి క్రేన్ల సహాయంతో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసిన ప్రదేశాల్లో వ్యర్థాలను వెలికి తీయనున్నారు. ఈ ప్రక్రియ సోమవారం సాయంత్రం వరకు పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News