Sunday, December 22, 2024

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -
482 new covid cases reported in telangana
ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 482 కేసులు నమోదు
రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 23 మందికి పాజిటివ్

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 482 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,971కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,031కి చేరింది. తాజాగా కరోనా నుంచి 212 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,74,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 423 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 23 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 84 ఒమిక్రాన్ కేసుల నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో తాజాగా ఐదుగురు కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 13,272 మంది తెలంగాణకు వచ్చారు.

మొదటి రోజు 24,240 మంది పిల్లలకు వ్యాక్సినేషన్

రాష్ట్రంలో 15 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలకు సోమవారం వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, మొదటి రోజు 1 శాతం మందికి టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు అర్హులైన పిల్లలు మొత్తం 1,84,1000 మంది ఉండగా, మొదటి రోజు 24,240 మంది పిల్లలు మొదటి డోసు తీసుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 4 శాతం మంది పిల్లలకు టీకాలు ఇచ్చినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News