Thursday, January 23, 2025

లోక్ అదాలత్‌లో 485 కేసులు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 485 కేసులను న్యాయమూర్తి హారిక పరిష్కరించినట్లు కోట్టు వర్గాలు తెలిపాయి. 394 కేసులు పరిష్కరించి 40,050 రూపాయల జరిమనాలు విదించినట్లు వారు పేర్కొన్నారు. ఎక్సైజ్‌కు సంభందించి ఎనిమిది కేసులు పరిష్కరించి నలబై వేల రూపాయలు రికవరీ చేశారన్నారు.బ్యాంకులకు సంభందించి ఎనిమిది కేసుల ద్వారా 43 వేల రికవరి, 72 క్రిమినల్ కేసులు పరిష్కరించి 87 వేల జరిమానాలు న్యాయమూర్తి విందించినట్లు చెప్పారు. భార్య భర్తలకు సంభందించి మూడు కేసులు పరిష్కరించి వారిని కలిపారు. లోక్ అదాలత్‌లో న్యాయవాదులు నామ శ్రీనివాస్, పండరి, సతీష్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News