Saturday, November 23, 2024

భారత్ లో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్విట్టర్ అక్టోబర్ 26, నవంబర్ 25 మధ్య భారతదేశంలో 45,589 అకౌంటులను నిషేధించింది. పిల్లల లైంగిక దోపిడీ, ఏకాభిప్రాయం లేని నగ్నత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఈ అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, దాని కొత్త యజమాని క్రింద మల్లగుల్లాలు పడుతోంది, అలాగే ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 అకౌంటులను కూడా తొలగించింది.

మొత్తంగా, భారతదేశంలో రిపోర్టింగ్ వ్యవధిలో ట్విట్టర్ 48,624 అకౌంటులను నిషేధించింది. ట్విట్టర్, కొత్త IT రూల్స్, 2021కి అనుగుణంగా తన నెలవారీ నివేదికలో, తన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా అదే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుండి 755 ఫిర్యాదులను స్వీకరించిందని , వాటిలోని 121 URLలపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News