Wednesday, January 22, 2025

యాసంగిలో 49.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

49.92 lakh tonnes of grain procured in Yasangi

మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.బండి సంజయ్ తీరుహంతకుడే సంతాపం తెలిపినట్లుందన్నారు. యాసంగిలో వరి సాగు చేస్తే వచ్చిన వరి ధాన్యం కేంద్రం చేత కొనిపిస్తాననిరైతులను రెచ్చగొట్టిపారిపోయాడన్నారు.ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొన్నాక తీరిగ్గా డబ్బులివ్వాలనిముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖలు రాస్తున్నాడన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత, రైతు సమస్యల గురించి నోరెత్తే అర్హత బండి సంజయ్ కి ఉందా అని ప్రశ్నించారు.

సుత్తిలికి, దబ్బుడానికి, గోనె సంచికి కూడా డబ్బులు కేంద్రమేఇస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రమే చేస్తుందని బీరాలు పలికే బండి సంజయ్ తెలంగాణముఖ్యమంత్రికి ఎందుకు లేఖలు రాస్తున్నారని నిలదీస్తూ, ప్రజలు నవ్వుకుంటారన్నఇంగితం కూడా ఉండదా అని ప్రశ్నించారు.పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ నోట్లువిడుదల చేయడంతో పాటు మరుసటి రోజు పత్రికలుచదివితే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో, వ్యవసాయ శాఖ ఎక్కడ ఉందో, అది రాష్ట్రంలో ఏ చేస్తుంది అన్న విషయం తెలుస్తుందన్నారు.ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు మినహా బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి ఒక్క రూపాయి అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా, కనీసం వీరిని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ది కోసం అయినా ఒక్క రూపాయి తెచ్చారా అని నిలదీశారు.

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇవ్వకపోగా, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలమాదిరిగానే పరిమితికి లోబడి రుణాలు తీసుకునే అవకాశాలను అడ్డుకుంటుంటే రాక్షసానందం పొందుతున్నారన్నారు. రైతులు బండి సంజయ్ డిమాండ్లు చూసి నవ్వుకుంటున్నారని, రాజకీయాల్లో హస్యనటుడిలాతయారయ్యాడన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి యాసంగిలో రూ.9772.54 కోట్ల విలువైన 49.92 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. మొత్తం రూ.9772.54 కోట్లకుగాను ఇప్పటికే రూ.7464.18 వేల కోట్లు చెల్లించడం పూర్తయిందన్నారు. మిగిలిన డబ్బుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నదని , త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. బండి సంజయ్ లాంటి వారి నుండి సూచనలు చెప్పించుకునే దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News