Monday, December 23, 2024

అజెర్‌బైజాన్ దాడుల్లో ఆర్మేనియా సైనికులు 49 మంది మృతి

- Advertisement -
- Advertisement -

49 Armenian soldiers killed in Azerbaijan attacks

యెరెవాన్ (అర్మేనియా): అర్మేనియా భూభాగంలో అజెర్‌బైజాన్ సైనిక దళాలు దాడి చేసి 49 అర్మేనియా సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. అర్మేనియా ప్రధాని నికొల్ పషిన్యాన్ మంగళవారం పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అజెర్‌బైజాన్‌లో భాగమైన నగొర్నో కరబఖ్ పై గత కొన్ని దశాబ్దాలుగా అజెర్‌బైజాన్, అర్మేనియా దేశాల మధ్య పోరాటం సాగుతోంది. వేర్పాటు వాదుల పోరాటం 1994లో ముగిసినప్పటి నుంచి ప్రస్తుతం ఈ భూభాగం అర్మేనియన్ సైనికుల స్వాధీనం లో ఉంది. గత ఆరు వారాల్లో 6600 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్మేనియా మద్దతుగల వేర్పాటు వాదుల నియంత్రణలో ఉండే నగొర్నో కరబక్‌కు చెందిన చాలా భూభాగాన్ని అజెర్‌బైజాన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో రష్యా సాయాన్ని అర్థించడానికి అర్మేనియా నిశ్చయించుకుంది. ఐక్యరాజ్యసమితిని కూడా అర్థిస్తోంది.అయితే ఇంతవరకు రష్యా నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు.అయితే ఉభయ దేశాలు సహజం పాటించాలని రష్యా విదేశీ మంత్రిత్వశాఖ సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News