Sunday, January 19, 2025

జైలులో అగ్నిప్రమాదం… 49మంది మృతి

- Advertisement -
- Advertisement -

Tailor murdered in Udaipur after support Nupur Sharma

బొగొటా: కొలంబియాలోని తులువా నగరంలోని కారాగారంలో అగ్నిప్రమాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 49మంది ఖైదీలు మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కారాగారంలో ఖైదీలు సోమవారం తెల్లవారు జామున నిరసన చేపట్టారు. ఈ సమయంలో పరుపులకు కొందరు నిప్పంటించడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దాంతో వారంతా తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. మృతులంతా ఖైదీలేనా అన్నది తెలియడం లేదని నేషనల్ ప్రిజన్ సిస్టమ్ డైరెక్టర్ టిటో కాస్టిల్లనోసం పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ దుక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు.

49 killed After fire broke out at Prison in Colombia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News