Monday, December 23, 2024

మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల లోక్ సభలోకి దుండగుల దూసుకొచ్చిన నేపథ్యంలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. దీంతో నిన్న(సోమవారం) ఒక్కరోజే 95మంది ఎంపిీలు సస్పెండ్ చేశారు.

మంగళవారం ప్రతిపక్ష ఎంపిలు ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్ లతో సహా 49మంది సస్పెండ్ అయ్యారు. దీంతో మొత్తం సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది. ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News