Sunday, December 22, 2024

ఉక్రెయిన్‌లో షాప్‌పై రష్యా రాకెట్ల దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెటు దాడిలో కనీసం 49 మంది పౌరులు మృతి చెందారు. ఓ స్టోర్స్‌పైనా, ఓ కేఫ్‌పైనా రష్యా రాకెట్లతో గురువారం మధ్యాహ్నం దాడికి దిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ కూడా ధృవీకరించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రష్యాకు సరిహద్దులలోని యుద్ధతాకిడి ప్రాంతం అయిన కుపియస్క్ జిల్లాపై రష్యన్లు విరుచుకుపడ్డారని.

ప్రజలు సరుకులు కొనుగోళ్లకు వెళ్లే షాప్‌లను ఎంచుకుని ఈ విధంగా క్రూరమైన దాడికి దిగడం రష్యా ఉద్ధేశపూరిత ఉగ్రవాద చర్య అని జెలెన్‌స్కీ తెలిపారు. కాగా స్థానిక అధికారులు ఈ దాడిలో దాదాపు 50 మంది వరకూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఎంత మంది గాయపడ్డారనేది లెక్కలోకి రాలేదు. రష్యా రాకెట్ దాడులలో ధ్వంసం అయిన స్టోర్ ఫోటోలను అందులోని హృదయవిదారక దృశ్యాలను తెలిపారు. ఇక్కడికి వచ్చి చనిపోయిన ఓ వ్యక్తి భౌతికకాయం ముందు ఓ మహిళ మోకాళ్లపై నిలబడి నివాళులు అర్పిస్తున్న ఫోటో , ఓ చోట చెల్లాచెదరై పడి ఉన్న శరీర భాగాల ఫోటోలు పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News