Friday, November 15, 2024

యువ ఓటర్ల చేతుల్లో అభ్యర్థుల భవిత

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని అభ్యర్థుల భవితయూత్ చేతుల్లో ఉంది. పార్టీ అయినా, అభ్యర్థి అయినా వారి విజయాన్ని యువతే తేల్చనుంది. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అదే విజయం కానుంది. అయితే నగరంలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపుతుండడంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు ఎక్కువగా 35ఏళ్ల బడిన ఓటర్లనే నమ్ముకుంటున్నారు. అందులోను బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీరంతా బాధ్యతాయుతంగా ఉండడం, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణంగానే నగరంలో ఏ ఎన్నికలు చూసిన 50శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అవుతోంది. అయితే ఈ సారి ఎన్నికల కమిషన్ యువత తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం ఇందుకు అనుగుణంగా జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక చోరవ తీసుకుని గత ఏడాది కాలంగా వివిధ రూపాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునే ముందుకు వస్తారని ఆశా భావం వ్యక్తంఅవుతోంది. ఇదే జరిగితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా యువత అభ్యర్థుల భవిత్తను నిర్దేశించనున్నారు.

18 నుంచి 49 ఏళ్ల లోపు ఓటర్ల సంఖ్య 32,14,594మంది (70.2 శాతం)
హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 45,36, 852 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 49 ఏళ్ల లోపు వయస్సు గల ఓటర్ల సంఖ్య 32, 14, 594 కాగా 50 నుంచి 80 ఏళ్ల పై బడిన ఓటర్ల సంఖ్య 13, 22,258 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోను 80 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 80,037 కాగా వీరిలో వయస్సు రీత్యా అనారోగ్యం ఇతర కారణాల వల్ల కొంత శాతం తమ ఓటు హక్కు వినియోగించునే అవకాశం తక్కువే అనేది అందరికీ తెలిసిన విషయమే.. అయితే మొదటి సారి ఓటు హక్కు పొందిన 18 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు వారు 77, 522 మంది ఉన్నారు.

అదేవిధంగా 20 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 7,24,364 కాగా 18 నుంచి 30 లోపువారు మొత్తం కలిపి 8,01,886 (17.7 శాతం) మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 30 నుంచి 39 ఏళ్ల లోపు వారి ఓటర్ల సంఖ్య 13,87,744 మంది (30.59) శాతం కాగా, 40 నుంచి 49 ఏళ్ల లోపు వారు 10,24,964 మంది (22.60 శాతం) ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం నగరంలో 18 నుంచి 49 ఏళ్ల లోపు ఓటర్ల సంఖ్య మొత్తం 32,14,594 మంది (71 శాతం)ఉండగా, మిగిలిన 50 నుంచి 80 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య కేవలం 29 శాతం మాత్రమే ఉంది.

49 శాతానికి పైగా యువ ఓటర్లు
హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాల్లో 49 శాతం పైగా యువ ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరి చూట్టే నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకంటే వీరు ఎటు వైపు మొగ్గు చూపితే వారినే విజయం వరించనుంది. వీరంతా 18 నుంచి 39 ఏళ్ల లోపు కావడం, ఇందులోనే అత్యధిక శాతం విద్యావంతులు కావడంతో వీరిని ప్రనన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో అయితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి, యువజన సంఘాల చాల క్రీయశీలక పాత్ర పోషించేవి.

ఎన్నికల సమయంలో వారే కీలకంగా వ్యవహరిస్తు విద్యార్థులు, యువకులు తమ తమ పార్టీల ఓట్లు రాబట్టే విధంగా కార్యచరణ ఉండేంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం, విద్యార్థులకు, యువతకు రాజకీయాల పట్ల ఆసక్తి పూర్తిగా సన్నగిల్లడంతో వారు ఓట్లను పొందేందుకు అభ్యర్థులే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఎందుకంటే యువత సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకుంటే అభ్యర్థుల తలరాతలు తలకిందులు కానుండడంతో వారి మన్నలను పొందేందుకు అన్ని పార్టీలు అభ్యర్థులు వ్యూహా రచనల్లో నిమగ్నమైయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News