Monday, December 23, 2024

వాయనాడ్‌లో వరద బీభత్సం… స్కూల్ ధ్వంసం.. 49మంది పిల్లలు గల్లంతు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: మూడు రోజుల క్రితం వాయనాడ్ జిల్లాను కుదిపివేసిన కొండచరియల దుర్ఘటనల్లో కనీసం 49 మంది పిల్లలు గల్లంతు కావడం లేదా మరణించడం జరిగిందని కేరళ సార్వత్రిక విద్యా శాఖ మంత్రి వి శివన్‌కుట్టి శుక్రవారం వెల్లడించారు. శివన్‌కుట్టి తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. వెల్లరిమలలో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రకృతి వైపరీత్యానికి పూర్తిగా ధ్వంసమైందని, ఆ పరిసరాల్లోని మరి నాలుగు పాఠశాలలు పెద్ద లేదా చిన్న నష్టానికి గురయ్యాయని తెలిపారు.

ప్రాణాలతో బయటపడిన పిల్లల్లో అనేక మంది పాఠ్యపుస్తకాలు, సర్టిఫికేట్లు కోల్పోయారని, ప్రభుత్వం వీటన్నిటినీ పరిశీలించి, ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత వారికి సాయం చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. 89 మంది మహిళలు, 29 మంది పిల్లలతో సహా 210 మృతదేహాలను ఇంత వరకు వెలికితీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News