- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 4,976 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదైనట్టు రాష్ట్ర,వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదే సమయంలో 7,646 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,97,361కి పెరిగింది. కోవిడ్-19తో ఇప్పటివరకు 2,739 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి 4,28865 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా, రాష్ట్రంలో ప్రస్తుతం 65,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24గంటల వ్యవధిలో 55,358 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 851 మందికి కరోనా వైరస్ సోకింది.
- Advertisement -