Friday, November 22, 2024

498 మంది ఉద్యోగులకు స్వరాష్ట్రంలో పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

498 Employees work in telangana

మనతెలంగాణ/హైదరాబాద్: పొరుగున ఉన్న ఆంధప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 498మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం లైన్‌క్లియర్ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఎంతో మంది ఇప్పటికే ఎపినుంచి తమ సొంత ప్రాంతమైన తెలంగాణకు చేరుకున్నారు. చివరిగా ఎపి ప్రభుత్వంలో మిగిలిపోయిన వారీకి కూడా తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఇచ్చిన ఆదేశాలమేరకు 498 మంది ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఎపి నుంచి తెలంగాణకు ఉద్యోగులను తీసుకురావడానికి కృషి చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సింగ్ రావు కృతజ్ణతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News