Wednesday, January 8, 2025

రేషన్ దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్

- Advertisement -
- Advertisement -

4G services in Ration shops in Telangana

హైదరాబాద్ : నగరంలో ప్రతి నెలా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరుకుల తూకాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టనుంది. ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలు పర్చేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతుంది. మే నెల నుంచి ఈవిధానం అమలు చేసేందుకు సిద్దమైతున్నట్లు జిల్లా పౌరసరఫరాల ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. 4జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాల డిజిటలీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అదికారులు పేర్కొంటున్నారు. బ్లూటూత్ సాయంతో ఈపాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 975 దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండగా హైదరాబాద్ జిల్లాలో 17,21,000 ఆహారభద్రతకార్డులు, రంగారెడ్డిలో 6,55,957 కార్డులు, మేడ్చల్ జిల్లాలో 5,24,534 కార్డులు ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రేషన్ దుకాణాల్లో తప్పుడు తుకాలు వేస్తున్నారని, 10కిలోల బియ్యానికి ఒక కేజీ తక్కువ వస్తున్నట్లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు రావడంతో కొత్త విధానాలకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

దీంతో తూకాల్లో తేడా రాకుండా ఉండటంతో పాటు కావాల్సిన సరుకులు మాత్రమే డ్రా అవుతాయి. బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈపాస్ యంత్రం, తూకం వేసే మిషన్ దూరంగా ఉండేది. లబ్దిదారుడు బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం యంత్రం ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు పక్కదారి పట్టించడం జరిగేంది. నూతన సాంకేతికతో ఆపాస్ మిషన్, తూనికల మిషన్ అనుసంధానం అవుతుంది. లబ్దిదారుడి వేలిముద్ర మ్యాచ్ అయిన తరువాత బ్లూటూత్ ద్వారా తూనికల మిషన్‌కు సమాచారం వెళ్లుతుంది. ఈవిధానం పూర్తిగా అమలైతే కార్డుదారులకు త్వరగా పంపిణీ చేయడమే కాకుండా బ్లాక్ మార్కెట్‌కు రేషన్ సరుకులు తరలించే అవకాశముండదని డివిజన్ పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అవుతాయని, ప్రజలు సహాకరిస్తే భవిష్యత్తులో ఈవిధానం పూర్తి స్దాయిలో అమలు చేసి రేషన్ సరుకులు లబ్దిదారులకే అందే విధంగా చేస్తామంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News