- Advertisement -
ప్రతి నెల 5వరకు పరిశీలన,
15న సాయం పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఇటీవల వెనుకబడిన వర్గాలకు లక్ష సహాయం చేస్తామని ప్రకటన చేసి ఈనెల 20వ తేదీవరకు దరఖాస్తులను స్వీకరించింది. వెంటనే లబ్దిదారులను ఎంపిక చేసేందుకు బిసి సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో రెండు రోజుల నుంచి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభం చేశారు. లక్ష సహాయం కోసం మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు బిసి-ఏ కేటగిరి నుంచి 2,66,001, బిసి-బి 1,85,136, బిసి-డి 65,310 ఎంబిసిలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం పరిశీలన కొనసాగుతుందని, ప్రతీ నెల 5వ తారీఖు వరకు పరిశీలన పూర్తియిన వారికి అదేనెల 15వ తారీఖున స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
- Advertisement -