Thursday, January 23, 2025

క్యూ3లో జిడిపి 5.4 శాతం

- Advertisement -
- Advertisement -

అంచనాల కంటే నెమ్మదించిన వృద్ధి రేటు
గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం

5.3 percent of GDP in Q3

 

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202122) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 5.4 శాతం నమోదు చేసింది. ఈసారి జిడిపి వృద్ధి అంచనా కంటే నెమ్మదిగా ఉంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ రెండోసారి జిడిపి డేటా అంచనాలను సవరించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చెందిన జిడిపి గణాంకాలు సోమవారం విడుదలయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 5.4 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం(202021) ఇదే త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 0.7 శాతంగా ఉంది. అయితే తాజా జిడిపి గణాంకాలు అన్ని అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 20.3 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 8.5 శాతంగా ఉంది. ఎన్‌ఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) ముందస్తు అంచనాల ప్రకారం, 2021-22లో జిడిపి వృద్ధి రేటు 8.9 శాతంగా అంచనా వేయగా, జనవరిలో విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాలో వృద్ధి రేటు 9.2 శాతంగా అంచనా వేశారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా విడుదలయ్యాయి. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.84 శాతానికి పెరిగింది. ప్రధానంగా కొన్ని ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. గత నెలలో డిసెంబర్ 2021లో 5.56 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన జనవరిలో 5.84 శాతానికి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News