Friday, January 24, 2025

యుఎస్‌లో 5.5 లక్షల ఫోర్డ్ పికప్ ట్రక్కుల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

డెట్రాయిట్: ఫోర్డ్ సంస్థ అమెరికాలో ఐదున్నర లక్షలకు పైగా పికప్ ట్రక్కులను వెనుకకు రప్పిస్తోంది. ట్రక్కులు ఎంత వేగంగా వెళుతున్నప్పటికీ అనూహ్యంగా మొదటి గేర్‌కు పడిపోవడం చోటు చేసుకుంటున్నది. 2014 మోడల్ సంవత్సరం నుంచి కొన్ని రకాల ఎఫ్ 150 పికప్ ట్రక్కులను సంస్థ వెనుకకు రప్పిస్తుంది. ఫోర్డ్ ఎఫ్ సీరీస్ పికప్‌లు యుఎస్‌లో అగ్ర శ్రేణిలో అమ్ముడవుతున్న వాహనాలు.

యుఎస్ భద్రత రెగ్యులేటర్లు మంగళవారం పోస్ట్ చేసిన డాక్యుమెంట్లలో గేర్లు అలా పడిపోవడం వల్ల ట్రక్కులపై డ్రైవర్లకు అదుపు తప్పుతుందని, ప్రమాదం అవకాశం ఉందని ఫోర్డ్ తెలియజేసింది. 2014 నుంచి 5.4 లక్షలకు పైగా ఫోర్డ్ పికప్ ట్రక్కులు అకస్మాత్తుగా దిగువ గేర్‌కు తగ్గిపోవచ్చునని, ప్రమాదానికి అవకాశం ఎక్కువ అని వచ్చిన ఫిర్యాదులపై యుఎస్ మోటార్ భద్రత రెగ్యులేటర్లు మార్చిలో దర్యాప్తు ప్రారంభించిన తరువాత సంస్థ ఈ నిర్ఱయం తీసుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News