- Advertisement -
తజికిస్తాన్, మయన్మార్ దేశాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఆదివారం ఉదయం తజికిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 16 కి.మీ (10 మైళ్ళు) లోతులో సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం వెల్లడించింది.
అలాగే, మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం ఉపరితలం నుండి కేవలం 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు పేర్కొంది. ఇటీవల మయన్మార్ లో సభవించిన భూ కంపం పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా 3,000 మందికి పైగా ప్రాణాలను ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
- Advertisement -