- Advertisement -
ఖాట్మండ్: నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఆదివారం భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.58 గంటల సమయంలో భూమి కంపిందని స్థానికులు తెలిపారు. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్.సిఎస్) పేర్కొంది. ఖట్మండ్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధిటుంగ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంప నేపథ్యంలో బిహార్ లోనూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. బిహార్ లోని కతిహార్, ముంగర్, మాదేపురా, బెగుసరాయ్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
- Advertisement -