- Advertisement -
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టార్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించడంతో చాలా ఇండ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. దీంతో 20మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు చెప్పారు.
5.7 Magnitude of earthquake hit Pakistan
- Advertisement -