- Advertisement -
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ సుమత్రా సమీపంలోని పారియామన్ సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయని, భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూ అంతర్భాగంలో 11.9 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని, సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు పేర్కొన్నారు.
5.8 Magnitude of Earthquake Hits Indonesia
- Advertisement -