Friday, November 22, 2024

పనిచేస్తున్న సంస్థపైనే సైబర్ దాడి.. ఐదుగురు ఉద్యోగులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

5 Arrested after cyber attacks on Hunger Technology

హైదరాబాద్: తాము పనిచేస్తున్న సంస్థపైనే సైబర్ దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు అమెరికాలో ఉండగా పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. వారి వద్ద నుంచి రివాల్వర్, 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హాంగర్ టెక్నాలజీ సంస్థను చేజిక్కించుకునేందుకు గతకొంత కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి ఇది సాధ్యం కాకపోవడంతో అందులోనే పనిచేస్తున్న ఉద్యోగులు అందాగ్ విజయ్‌ కుమార్, కరణ్‌ కుమార్, అశ్వంత్‌ కుమార్‌తోపాటు మరో ఇద్దరుతో కలిసి సంస్థపై సైబర్ దాడులు చేయించారు. గత కొనేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులు సైబర్ దాడులు చేస్తున్నారు. ఇది గమనించిన హాంగర్ టెక్నాలజీ యాజమాన్యం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అమెరికాలో ఉన్న మరో నిందితుడిని రిప్పించేందుకు లుక్‌ఔట్ నోటీసు ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

5 Arrested after cyber attacks on Hunger Technology

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News