Monday, December 23, 2024

భారత్‌లో 5 ఎక్స్‌బిబి కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన కరోనా ఎక్స్‌బిబి 1.5 వేరియంట్ కేసులు భారత్‌లో నమోదయ్యాయని ఇన్సకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ( ఇన్సకాగ్) డేటా వెల్లడించింది. ఈ ఐదు కేసుల్లో మూడు గుజరాత్‌లో, కర్ణాటక, రాజస్థాన్‌ల్లో ఒక్కొక్కటి వంతున బయటపడ్డాయని మంగళవారం వివరించింది. ఎక్స్‌బిబి వేరియంట్… ఒమిక్రాన్ ఎక్స్‌బిబి వేరియంట్‌కు సంబంధించింది.

ఒమిక్రాన్ బిఎ. 2జ 10.1, బిఎ .2.75 సబ్‌వేరియంట్ల తిరిగి స మ్మేళనం కావడం వల్ల ఇది ఏర్పడింది. ఎక్స్‌బిబి, ఎక్స్‌బిబి 1.5 ఈ రెండూ కలయికతో అమెరికాలో మొత్తం కేసుల్లో 44 శాతం వర కు ఇవి వ్యాపించాయి. కొవిడ్ 19 వేరియం ట్ ఒమిక్రాన్, దాని ఉపవేరియంట్లు ఎక్స్‌బిబితో కలిసి భారత్‌లో విపరీతంగా విజృంభిస్తున్నాయని ఇన్సకాగ్ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News