Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీకి ఝలక్ ? పర్యటనకు ఐదుగురు ఎంపీలు బాయ్‌కాట్

- Advertisement -
- Advertisement -

5 Congress MPs boycott Rahul Gandhi Punjab visit

ఛండీగఢ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన రోజే పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. పంజాబ్ లోని ఓ వర్గం ఏకంగా రాహుల్ గాంధీకే ఝలక్ ఇచ్చారు. ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ పర్యటనను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో మనీశ్ తివారీ, నవనీత్ బిట్టూ, జస్‌బీర్‌డింపా, మహ్మద్ సిద్దిఖీ, పరణీక్ కౌర్ బాయ్ కాట్ జాబితాలో ఉన్నారు. రాహుల్ గురువారం పంజాబ్ పర్యటనకు వెళ్లారు. అమృత్‌సర్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి చన్నీ, పీసిపీ అధ్యక్షుడు సిధ్ధూ అగ్రనేత రాహుల్‌కి స్వాగతం పలికారు. ఆ తరువాత జలియన్ వాలాబాగ్ సందర్శనకు రాహుల్ వెళ్లారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఈ ఎంపీలు రాహుల్‌గాందీ పర్యటనను బాయ్‌కాట్ చేయడంపై అధిష్ఠానం స్పందించింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జీ కేపీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ వార్తను కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News