Saturday, November 23, 2024

భారత్‌కు 5కోట్ల ఫైజర్ టీకా డోసులు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఐదు కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు భారత్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఫార్మా దిగ్గజం ఫైజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య కొన్ని వివాదాస్పద అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమైతే ఆమేరకు డోసులు భారత్‌కు అందుతాయి. ఈ డోసులు అందుబాటు కాడానికి ప్రధాన అడ్డంకి సంస్థకు సంబంధించిన చట్టపరమైన నష్టపరిహారం సమస్య. భారత్ చట్టం ప్రకారం అది వివాదంగా ఉంటోంది. ఈ వివాదాస్పద అంశం వల్ల ఒప్పందానికి ఇంకా మార్గం సుగమం కాలేదని ఉన్నత స్థాయి అధికార వర్గాలు పేర్కొన్నాయి. చర్చల ద్వారా ఇవన్నీ పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వెలిబుచ్చారు. టీకాలకు కొరత రాకుండా ఉండడానికి ఇతర దేశాల టీకాలను వినియోగించేందుకు భారత్ అనుమతించింది.అయితే అమెరికాలో తయారౌతున్న ఫైజర్, మోడెర్నా టీకాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఐరోపా దేశాల్లో ఉత్పత్తి అవుతున్న కేంద్రాల నుంచి భారత్‌కు టీకాలు రాబోతున్నాయి. రాష్ట్రాల్లో టీకాల కొరతను నివారించడానికి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు నేరుగా టీకాలను కొనుగోలు చేయడానికి గ్లోబర్ టెండర్లను పిలుస్తున్నాయి.

5 Crore pfizer vaccine may come to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News