Monday, March 31, 2025

ఛత్తీస్‌గడ్‌లో ఐఈడి పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో టార్రెమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిఆర్పిఎఫ్ శిబిరానికి 350 మీటర్ల దూరంలో బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చినఈఐడి బాంబు నిర్వీర్యం చేసే క్రమంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ 153వ బెటాలియన్ సిబ్బంది చిన్నగేలూర్ క్యాంపు నుంచి కూంబింగ్ బయలుదేరిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏసీ సాకేత్, ఇన్‌స్పెక్టర్ సంజయ్, సిటీ డిహెచ్ పవన్ కళ్యాణ్, సిటీ జీడి లోచన్ మెహతా సిటీ జీడి డ్యూల్ రాజేంద్ర మెహతా రాజేంద్ర గాయపడ్డారు. గాయపడ్డ సైనికులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సైనికులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఏఎస్పీ చంద్రకాంత్ గవర్ణ ధృవీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News