Monday, December 23, 2024

మణిపూర్ ఆఫీసులలో 5 రోజుల పని

- Advertisement -
- Advertisement -

5 days work in Manipur offices

ఎప్రిల్ 1 నుంచి అమలులోకి

ఇంఫాల్ : బిజెపి అధికారంలోకి వచ్చిన మణిపూర్‌లో ఇకపై ప్రభుత్వ కార్యాలయాలన్ని వారంలో ఐదు రోజులే పనిచేస్తాయి. సోమవారం నుంచి శనివారం వరకూ ఆఫీసులు పనిచేసే విధానం ఎప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇటీవలే సిఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని అమలులో పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. సంబంధిత అంశంపై అధికారిక నోటిఫికేషన్ వెలువరించారు. దీని మేరకు రాష్ట్రంలో మార్చి నుంచి అక్టోబర్ వరకూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటలవరకూ పనిచేస్తాయి. చలికాలంలో సాయంత్రం 5 గంటల వరకూ కార్యాలయల వేళలను నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అరగంట భోజన విరామ సమయం ఉంటుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఐదురోజుల పనిదినాలు అమలు అవుతాయి. అయితే ఉదయం 8 గంటలకు స్కూళ్లు తెరవాలి. ఉద్యోగులలో పనితీరును వారి సమర్థతను శక్తిని పెంచేందుకు ఈ ఐదురోజుల విధానం అమలులోకి తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దశలో వందరోజులలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను సిఎం వివరించారు. ఇందులో భాగంగా ఐదురోజుల పనిదినాల విషయం ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News