Sunday, December 22, 2024

మధురలో భవనం బాల్కనీ కూలి ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ మధుర లోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో దుసాయిట్ ప్రాంతంలో మంగళవారం మూడంతస్తుల భవనం బాల్కనీ కూలి ఐదురుగు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. వీరిని బృందావన్ లోని షౌ షయ ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో భవనం తడిసి బాల్కనీ కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉండవచ్చని పోలీస్‌లు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. భవనం లో బాగా దెబ్బతిన్న భాగాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News