కర్నాటకలోని జెవర్గీ తాలూకాలోని నెలోగి క్రాస్ సమీపంలో నిలబడి ఉన్న లారీని శనివారం వేకువ జామున మినీ బస్సు ఢీకొంది. కాగా మినీ బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయారు. వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇంకా అనేక మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మినీ బస్సులో ప్రయాణించిన వారందరూ బాగల్‌కోట్‌కు చెందిన వారే. వారు కలబుర్గీలోని దర్గాకు వెళుతుండగా వేకువ జామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు ఢీకొనడంతో లారీ టైరు పంక్చర్ అయింది. డ్రైవరు టైరును మారుస్తుండగా ఈ ఘటన జరిగింది. మినీ బస్సు అతడి వెనుక నుంచి వచ్చి లారీని ఢీకొందని సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు కలబుర్గీ పోలీస్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసులు తెలిపారు. యాక్సిడెంట్ జరగగానే మినీ బస్సు డ్రైవర్ పారిపోయాడని కూడా ఆయన తెలిపారు. కేసును నమోదు చేశామని, పారిపోయిన ఆ డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ బస్సు..ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -