పాట్నా: సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో గురువారం నాటుసారా తాగి ఐదుగురు మరణించారు. అయితే వారు తాగింది ఒక తెల్లని రసాయనిక ద్రవమని జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ స్థానికులు మాత్రం అది సారా అని స్పష్టంచేస్తున్నారు. బుక్సర్ జిల్లాలోని దుమ్రావ్ సబ్‌డివిజన్‌కు చెందిన అన్సార్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. బుధవారం రాత్రి ఏదో గుర్తుతెలియని రసాయనం తాగి ఎనిమిది మంది అస్వస్థులయ్యారని బుక్సర్ జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. వీరిలో ఐదుగురు మరణించగా మిగిలిన ముగ్గురు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. వారు తాగిన తెల్లని రసాయనానికి చెందిన బాక్సులను పరీక్షల నిమిత్తం పంపించినట్లు ఆయన చెప్పారు. అయితే స్థానికులు మాత్రం మృతులు, వారి స్నేహితులు తాగింది సారాయేనని చెప్పారు. 2016 ఏప్రిల్ నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది. అయితే గత ఏడాది నవంబర్ నుంచి అనేక జిల్లాలలో కల్తీ సారా తాగి 50 మందికి పైగా మరణించారు.
బీహార్‌లో సారా తాగి ఐదుగురి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -