Wednesday, January 22, 2025

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

5 died in Car collided with electric pole at Prayagraj

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వింధ్యాచల్ ఆలయానికి ప్రయాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. హండియా టోల్‌ప్లాజా సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు తమ టవేరా కారులో వింధ్యాచల్ ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హాండియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. మృతులను రేఖ (45), రేఖ (32), కృష్ణదేవి (70), కవిత (36), ఏడాది వయసున్న కుమారి ఓజస్‌ గా గుర్తించారు. గాయపడిన ఉమేష్, అతని భార్య ప్రియ, వారి కుమార్తె గోటు (12), 26 ఏళ్ల రిషబ్, డ్రైవర్ ఇర్షాద్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News