Thursday, December 19, 2024

స్కూలు వ్యానును ఢీకొన్న కాలేజ్ బస్సు: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

బుదోన్(యుపి): ఒక స్కూలు వ్యాను ఒక కాలేజ్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, వ్యాను డ్రైవర్ మరణించగా మరో 16 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బుదోన్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్‌ఆర్‌పిఎస్ ఇంగ్లీష్ మీడియాం స్కూలు విద్యార్థులతో వెళుతున్న మారుతీ వ్యాను ఎదురుగా వస్తున్న సత్యదేవ్ ఇంటర్ కాలేజ్ బస్సును ఢీకొన్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తెలిపారు. నవీగంజ్ గ్రామం వద్ద ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. 28 ఏళ్ల వ్యాను డ్రైవర్‌తోపాటు 6 నుంచి 9 ఏళ్ల వయసున్న నలుగురు విద్యార్థులు మరనించినట్లు ఆయన చెప్పారు.

గాయపడిన విద్యార్థులలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. దాదాపు 20 మంది విద్యార్థులు మారుతీ వ్యానులో స్కూలుకు వెళుతున్నారని, ఎదురుగా ఉన్న గుంతను తప్పించబోయి వ్యాను డ్రైవర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కాలేజ్ బస్సును ఢీకొన్నాడని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News