Sunday, January 12, 2025

ఐదుగురిని బలిగొన్న అతివేగం

- Advertisement -
- Advertisement -

5 died in Road accident

ఎపిలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద
సాగర్ కాలువ కల్వర్టును ఢీకొన్న కారు

మృతులు హైదరాబాద్‌లోని చందానగర్ వాసులు

మనుమరాలు అన్నప్రాశనకు
చందానగర్ నుంచి
జంగారెడ్డి గూడెం వెళ్తుండగా
ప్రమాదం తెల్లవారుజాము
3గంటలకు విషాదం ఆరు
నెలల చిన్నారి సహా ఐదుగురు
అక్కడికక్కడే దుర్మరణం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి సాగర్ కెనాల్ కల్వర్టును ఢీకొట్టడంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందు తూ చనిపోయారు. మృతుల్లో ఆరు నెలల పసిపాప ఉంది. ఈ ఘోర ప్రమాద సంఘటనకు సంబంధిం చిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. హైదరాబాద్ లోని చందానగర్‌కు చెందిన కుటుంబరావు.. మను మరాలు అన్నప్రాశనం కోసం పశ్చిమగోదావరి జి ల్లా జంగారెడ్డిగూడెంకు కారులో బయల్దేరారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో వీరు ఇంటి నుంచి కారులో బయల్దేరారు. కుటుంబరావు, ఆయన భార్యతో పాటు, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న కుమారుడు జోషి, కోడలు, కుమార్తె, మనవరాలు కారులో ప్రయాణిస్తున్నారు. కుమారుడు జోషి కారు డ్రైవింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌విజయవాడ జాతీయరహదారి 65పై ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. నాగార్జునసాగర్ ఎడమకాలువ వంతెన కల్వర్టును వేగంగా వెళుతూ అదుపుతప్పిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ఘటనాస్థలంలోనే ఇంటి పెద్ద కుటుంబరావుతో పాటు కుమార్తె , కోడలు చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబరావు భార్య, కుమారుడు, మనవరాలిని స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబరావు భార్య మేరీ, కుమారుడు జోషిని విజయవాడకు తీసుకువెళ్తుండగా మేరీ చనిపోయారు.

ప్రస్తుతం జోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అతివేగంతో వస్తున్న కారు చిన్నపాటి మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒకవేళ కల్వర్టును ఢీకొట్టకుంటే కారు సాగర్ కాలువలో పడేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇలా ఐదుగురు మృతి చెందడంతో ఇటు జంగారెడ్డిగూడెంతో పాటు అటు హైదరాబాద్ చందానగర్‌లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిద్రమత్తు, మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News