Friday, December 20, 2024

చెరువులో మునిగి ఐదుగురు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మరణించారని పోలీసులు బుధవారం తెలిపారు. సంప్రదాయంగా నిర్వహించే ఓ దేవాలయ ఉత్సవాల్లో వీరు పాల్గొన్నారు. ఉత్సవాల్లో నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా పూజారులు, వాలంటీర్లు చెరువులోకి ప్రవేశించి వృత్తాకారంలో ఏర్పడ్డారు.

ఈక్రమంలో వారిలో ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించిన నలుగురు యువకులు కూడా నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. సీనియర్ రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. క్రోమ్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News