Monday, December 23, 2024

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యుత్ అధికారుల సస్పెన్షన్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యుత్ అధికారులను విధుల నుండి సస్పెండ్ చేశారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వారిపై కఠిన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా సిఎండి జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. ఉద్యోగంలో నుండి కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17న రాత పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు ముంది ఉద్యోగులు కుట్ర, దురాలోచనతో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారనే కారణంతో వీరి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యుత్ సంస్థ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో పనిచేస్తున్న మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ((ఎడిఈ లైన్స్, మలక్‌పేట్), సపావత్ శ్రీనివాస్ (లైన్‌మెన్ విద్యానగర్) లను విధుల నుండి సస్పెండ్ చేశారు. రేతిబౌలి సెక్షన్ లో ప్రైవేట్ మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న కేతావత్ దస్రు అలియాస్ దశరథ్ ను విధుల నుండి తొలగించారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న షేక్ సాజన్ (సబ్ ఇంజనీర్, జగిత్యాల) తెలంగాణ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న మంగళగిరి సైదులు (ఎడిఈ, ఫిప్ట్, మిర్యాలగూడ) లను విధుల నుండి సస్పెండ్ చేశారు.

5 Electricity Officers Suspended for Malpractice

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News