గోవా నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు చెన్నైకు తరలింపు
18న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో చీలిక ఘట్టం
మొత్తం 11 మందిలో పార్టీకి దూరంగా ఆరుగురు
పనాజి(గోవా): ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో గోవాలోని మొత్తం 11మంది కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల్లో ఐదుగురిని చెన్నైకు తరలించారు. ఆ ఐదుగురిలో సంకల్ప్ అమోంకర్, యురి అలమయో, ఆల్టోన్ డి కాస్టా, రుడోఫ్ ఫెర్నాండెజ్, కెర్లోస్ అలవరెస్ ఫెరీరియా ఉన్నారు. గోవా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం సాయంత్రం పూర్తి కాగానే వీరంతా చెన్నైకు పయనమయ్యారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల కోసం వీరు నేరుగా గోవాకు తిరిగి రాబోరని కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. అయితే మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ఈ గ్రూపులో ఎందుకు చేరలేదో తెలియడం లేదు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ మైకేల్ లోబోను దీని గురించి అడగ్గా తనను ఎవరూ ఆహ్వానించలేదని, ఆ ఐదుగురు తమ పార్టీ ఎమ్‌ఎల్‌ఎలను ఎందుకు చెన్నై తీసుకు వెళ్లారో తనకు తెలీదని చెప్పారు.
గత ఆదివారం అసెంబ్లీ విపక్ష నేత బాధ్యతల నుంచి కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ మైకేల్ లోబోను కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించింది. మరో ఎమ్‌ఎల్‌ఎ కామత్ బీజేపీతో కుమ్మక్కై పార్టీని చీల్చడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం లోబో, కామత్‌తో సహా ఐదుగురు ఎమ్‌ఎల్‌ఎలు అధిష్ఠాన వర్గానికి అందనంత ఏకాంతంలో ఉన్నారని పేర్కొంది. అయినాసరే వీరంతా గోవా అసెంబ్లీ మొదటి రోజు సమావేశాలకు హాజరయ్యారని వివరించింది. గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఎమ్‌ఎల్‌ఎలు కామత్, లోబోలకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్‌కు దాఖలు చేశారు.
5 Goa Congress MLAs Moves to Chennai