- Advertisement -
ముంబై : ముంబైలోని చెంబూర్ గోల్ఫ్ క్లబ్ ప్రాంతానికి సమీపంలో ఓల్డ్ బ్యారక్ వద్ద బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇప్పటివరకు 11 మందిని బయటకు తీసుకురాగలిగారు. వీరిలో నలుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపకసిబ్బందితోపాటు పోలీస్‌లు, మున్సిపల్ సిబ్బంది, అంబులెన్స్ సర్వీస్ , ఇతర సంస్థల సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- Advertisement -