Sunday, January 19, 2025

ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎన్నికల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం ప్రభుత్వం మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ బీహెచ్ సహదేవ్‌రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవపాటిల్ నియామకం అయ్యారు.

అదే విధంగా మరో 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ బిట్టల్ ఉత్వర్తులు జారీ చేశారు. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా పర్యా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్‌గా ఎ. వెంకట్‌రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బిఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సిహెచ్. మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డి.వేణుగోపాల్ బదిలీ అయ్యారు. ఈబదిలీల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News