Sunday, December 22, 2024

కెనడా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

5 Indian students killed, 2 hurt in Canada road mishap

ఒట్టావా: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాలోని భారత కమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గాయపడ్డ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టొరెంటోలో శనివారం తెల్లవారు జామున 3.45 గంటలకు ఆ విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాదంలో మరణించిన విద్యార్థుల పేర్లను ఓంటారియో ప్రావిన్షియల్ పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. దుర్ఘటనలో హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News