మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరి 12 మంది జవాన్లు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఎదురుకాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ,డిజిపి సమీక్షిస్తున్నారు. సంఘటన స్థలానికి రెండు హెలీకాప్టర్లు పంపి మృతదేహాలను గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యంకోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాల్పులు కొనసాగుతుండడంతో సహాయక చర్యలకు అం తరాయం ఏర్పాడినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు. యాంటి ఆపరేషన్‌లో భాగంగా శనివారం రాత్రి బీజాపూర్,సుక్మా జిల్లాల నుండి డీఆర్జీ, సీఆర్పీఎఫ్ కోబ్రా ప్రత్యేక బలగాలు మొత్తం 2058వేల మంది జవాన్లు సంయుక్త కూబింగ్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.ఈ నేపథ్యంలోనే శనివారం సుమారు 12 గంటల సమయంలో సుక్మా జిల్లా జిగురుగుండా పోలీసుస్టేషన్ పరిధిలోని జోనగూడ గ్రామ సమీపంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపులా కా ల్పులు చోటుచేసుకున్నాయాని ఎస్పీ వెల్లడించారు.
మూడు గంటలు ఎదురుకాల్పులు కొనసాగాయని ఎస్పీ తెలిపారు. శనివారం సాయంత్రం వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కోబ్రా బలగంలో ఒక జవాన్, బలగానికి చెందిన ఇద్దరు జవాన్లు సహా మొ త్తం ఐదురుగు తెలిపారు. మ రో 12మంది జవాన్లు గాయాలయ్యాయని వె ల్లడించారు. ఘటనా స్థలంలో ఓ మహిళ మా వోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. మావోయిస్టులకు సైతం భారీన ష్టం కలిగిగుండచ్చన్నారు. శనివారం సాయం త్రం వరకు కూడా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.