- Advertisement -
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ఓ కారు లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. చంబా జిల్లా తిస్సా తహసీల్ లోని సత్రుండి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చంబా మెడికల్ కాలేజీకి తరలించారు. మృతులు చంబాకు చెందిన రాకేష్ కుమార్, అమర్‌జీత్ సింగ్, మనోహర్, రాజీవ్‌శర్మ, హేమ్‌సింగ్‌లుగా గుర్తించారు. వేగంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
5 Killed after Car fell into Valley in Shimla
- Advertisement -