Monday, December 23, 2024

పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కెందుఝార్ జిల్లాలోని సటిపూర్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News